![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-915 లో.. కావ్య ప్రెగ్నెంట్ అని తనని రాజ్ అపురూపంగా చూసుకుంటాడు. ఇక రాత్రి కావ్య, రాజ్ పడుకున్నాక.. కావ్యకి తమ ఇల్లు తగలబడి పోతున్నట్టు కల వస్తుంది. వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో రాజ్ లేచి ఏమైందని అడుగుతాడు. మన ఇల్లు తగలడిపోయినట్టు నిజంగా అనిపించిందని కావ్య చెప్పగా.. అదంతా నీ ఇల్యూజన్ పడుకోమని రాజ్ చెప్తాడు.
మరోవైపు రాహుల్ తీవ్రంగా ఆలోచిస్తుంటే అతని దగ్గరికి రుద్రాణి వస్తుంది. ఏంట్రా మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావని రుద్రాణి అడుగగా.. ఒక మాస్టర్ ప్లాన్ వేశానని రాహుల్ అంటాడు.
మరుసటిరోజు ఉదయం కావ్య లేచి దేవుడికి పూజ చేస్తుంది. ఇక అపర్ణ, ఇందిరాదేవిలకి కావ్య హారతి ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ కి హారతి ఇస్తుంది కావ్య. అతను తీసుకునేటప్పుడు హారతి ఆగిపోతుంది. దీంతో అపర్ణ, కావ్య, ఇందిరాదేవి కంగారుపడతారు. అది అశుభమని అంటారు. రాజ్ ని ఇంటిపట్టునే ఉండమని అందరు అంటారు. కానీ అతడు వినడు.
మరోవైపు ఇంటిబయట అప్పు అటుఇటు తిరుగుతుంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి ఏం అయిందని అడుగుతాడు. హా అలసిపోతున్నానని అప్పు అనగా.. ఈ టైమ్ లో వాకింగ్ చాలా మంచిది అని చెప్తాడు. అప్పుడే ధాన్యలక్ష్మి పుస్తకాలు పట్టుకొని వస్తుంది. తనతో పాటు ప్రకాశ్ వస్తాడు. అప్పుని సివిల్స్ కి ప్రిపేర్ అవ్వమని ధాన్యలక్ష్మి చెప్తుంది. దాంతో ప్రకాశ్, కళ్యాణ్ షాక్ అవుతాడు. నువ్వేనా ధాన్యం ఇలా మాట్లాడేది అని ప్రకాశ్ అనగా.. నేనే అంటున్నా.. అప్పు నా మాటకి గౌరవమిచ్చి ఇంట్లోనే ఉంటున్నప్పుడు తనని నేను కూడా అర్థం చేస్కోవాలి కదా.. అందుకే తను ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని సివిల్స్ చదువమని చెప్తున్నానని ధాన్యలక్ష్మి అనగానే అందరు సంతోషిస్తారు. ఇక అప్పు వెళ్ళి ధాన్యలక్ష్మిని హగ్ చేసుకుంటుంది.
మరోవైపు బంగారం స్మగ్లింగ్ చేసే అతడికి రాహుల్ ఫోన్ చేస్తాడు. నువ్వు ఇంపోర్ట్ చేసుకునే బంగారం మొత్తం నేనే కొంటాను. అయితే నువ్వు చేయాల్సిందల్లా.. వెళ్ళి రాజ్ ని కలిసి ఈ ప్రపోజల్ చెప్పమని అతడితో రాహుల్ అనగానే.. రాజ్ గెంటేస్తాడని అతను అంటాడు. అదే మనకి కావాల్సిందని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ప్లాన్ అంతా రుద్రాణికి వివరిస్తాడు రాహుల్.
మరుసటి రోజు బంగారం స్మగ్లింగ్ చేసే అతను రాజ్ దగ్గరికి వచ్చి అతని ప్రపోజల్ చెప్తాడు. అది విని బయటకి పోరా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |